-Advertisement-

భైంసాలో ప్రశాంతంగా రంజాన్ వేడుకలు

*తప్పిపోయిన చిన్నారులను గుర్తించిన పోలీసులు

చిత్రం న్యూస్, బైంసా: భైంసా పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భారీ జనసందోహం మధ్య తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను పోలీసులు చాకచక్యంగా గుర్తించి, వారి కుటుంబాలకు సురక్షితంగా అప్పగించారు. రంజాన్ పండగ సందర్భంగా భైంసా పట్టణంలోని ఈద్గా వద్దకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం తరలివచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన భారీ జనసందోహంలో ముగ్గురు చిన్నారులు తప్పిపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసి చిన్నారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల అప్రమత్తతతో కొద్ది సమయంలోనే చిన్నారులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రార్థనల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈద్గా వద్ద ప్రత్యేక పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా రంజాన్ ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు.ఈ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిలతో పాటు ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు మల్లేష్, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్, ఎస్ఐ అశోక్, ఆర్‌ఎస్‌ఐలు రవి, సాయి కృష్ణ తదితర పోలీసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments