చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో ముస్లిం సోదరులకు గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి శుక్రవారం మజీద్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా ఆయన పండ్లు తినిపించారు. వారికి ముందస్తు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మజీద్ పెద్దలు, పలువురు ఆయనను శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు మంచాల నిఖిల్ రెడ్డి, వార్డు సభ్యులు సునీల్ గోహార్కర్, నవగరే రణధీర్, సిద్రప్ సుభాష్, నందు గౌడ్, నాగపూరే మీలింద్, పాండురంగ్, ముస్లిం సోదరులు అజిజ్, షైక్ ఫరీద్, అఫ్రోజ్ ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /

