రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు మొండిచేయి..బీజేఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేఎల్పీ ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా బీసీ వర్గాలను మోసం చేసే విధంగా ఉందని, అణగారిన వర్గాల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం: గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీసీలకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో బీసీలకు కనీసం...