చిత్రం న్యూస్, బేల: సిర్సన్న గ్రామంలోని జై మల్హర్ యూత్ ఆధ్వర్యంలో పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అముల్,సాహిల్, అంకిత్, గ్రామస్తులు సురేష్ రెడ్డి, దీపక్ గౌడ్, భూమన్న,సుభాష్, దేవేందర్ ,భూమరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఇటువంటి ఆధ్యాత్మిక, స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /

