Chitram news
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 3:19 pm Editor : Chitram news

ముథోల్ లో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ 

చిత్రం న్యూస్, బాసర:  నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి గల్లీ మున్నూరుకాపు సంఘం భవనము కమాన్ గాంధీ విగ్రహం వద్ద ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం  నిర్వహించారు. నియోజకవర్గం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు రోళ్ళ రమేశ్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరికి మంచి జరిగాలని, సుఖ శాంతులతో ఉండాలని, రైతులు పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నంతంగా ఎదగాలని, వ్యాపారులు వ్యాపార రంగంలో,  నాయకులు రాజకీయంగా మంచి పదవులు అనుభవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అందరు ఇలాగే కలిసి మెలిసి అన్ని పండుగలు సంతోషంగా జరుపుకుంటూ మన గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పర్చుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు గడ్డం సుభాష్, పట్టణ అధ్యక్షులు లవన్ భాస్కర్, కార్యదర్శి గోసుల రాజు, VDC అధ్యక్షులు వరగంటి విట్టల్, కోశాధికారి జిందంవార్ వెంకటేష్, కార్యదర్శి ఆగాలం దశరథ్, మండల BJP అధ్యక్షులు కోరి పోతన్న, సంఘం మెంబర్లు V పోతన్న, H భోజన్న, P బాబు, B శంకర్, D శైలేష్ గార్లతో పాటు K రాజేశ్వర్ సార్, GP మెంబర్స్ S పోతన్న, M సతీష్, N విష్ణు, జానకిరామ్ లతోపాటు భాస్కర్ పోతన్న, IT గంగాధర్, Dr నర్సయ్య, A రాజు, S ప్రకాష్, B దేవన్న, R రాజన్న, E పండరి, K గంగాధర్, M ఎల్లయ్య, S అరవింద్, G ప్రసాద్, భోజన్న, M లింగం, పోశెట్టి, S నరేష్, P భూమేష్, K రాకేష్, G లక్ష్మణ్, దేవేందర్ గౌడ్ సార్, పోతాజీ సార్, M శంకర్, S యాదవ్, శంకర్ పటేల్, సాయినాథ్, S శ్యామ్, R బాలాజీ, నారాయణ, నడిపెన్నా, J చిన్ను, గార్లతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /