-Advertisement-

ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

చిత్రం న్యూస్, అదిలాబాద్:ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పరాభావ నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పార్టీ నాయకులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..  ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మేలవింపే మన జీవితం అని ఈ నూతన సంవత్సరంలో రైతులకు మంచి పంటలు పండి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ప్రజలందరూ ఐక్యమత్యంతో ఈ పండుగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత , మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగిల నర్సింగ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సామ రూపేష్ రెడ్డి, కౌన్సిలర్లు చరణ్ గౌడ్, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, కాంబ్లె మంగేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ వేముల నాగరాజు, తొడసం దౌలత్ రావు, గౌలి సంజయ్, సేవాదళ్ జిల్లా సెక్రెటరీ అప్సర్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments