Chitram news
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 12:51 pm Editor : Chitram news

ఇందిరమ్మ ఇళ్ళులబ్ధిదారుడికి ప్యూర్ డెయిరీ ఛైర్మన్, అన్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ ఉదారత  

చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కేఆర్కే కాలనీకి చెందిన వావలే సుశీల్ కు రూ.13,200 విలువగల విద్యుత్ సామాగ్రిని ప్యూర్ డెయిరీ ఛైర్మన్, అన్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ అందజేసి ఉదారత చాటారు. ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం సుశీల్  కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసింది. కాగా ప్యూర్ డెయిరీ ఛైర్మన్ అన్సార్ వద్ద పనిచేస్తున్న సుశీల్ కు విద్యుత్ సామాగ్రి కోసం ఆర్థిక సాయం అందజేయడంతో  సుశీల్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.  ఈ సందర్భంగా ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ కు కృతఙ్ఞతలు తెలిపారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /