Chitram news
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 8:54 pm Editor : Chitram news

భైంసాలో ఘనంగా ఇఫ్తార్ విందు: పాల్గొన్న: మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణ రావు పాటిల్

చిత్రం న్యూస్, భైంసా : పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా భైంసా పట్టణంలోని నూర్ మజీద్ ప్రాంగణంలో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు బోస్లె నారాయణ రావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..మనుషుల మధ్య సోదరభావం, మతాల మధ్య సామరస్యం తెలంగాణ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. ఈ విలువలను ప్రతి ఒక్కరూ కలిసి కాపాడుకోవాలని ఆకాంక్షించారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో అల్లా దయతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. పరమత సహనం, గంగా–జమున తహజీబ్ వంటి సంస్కృతులను గౌరవించడం తెలంగాణ ప్రత్యేకత అని తెలిపారు. మైనారిటీ ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్, పురపాలక సంఘం చైర్మన్ తుమ్ముల దత్తాత్రి, వైస్ చైర్మన్ మీర్జా ఇద్రిస్ బైగ్, మాజీ ఎంపీపీ, రామచంద్రారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే, బైంసా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు షాహిద్ అలీ, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, నాయకులు దేవిదాస్, రవి కుమార్, మైనారిటీ నాయకులు హాఫిజుల్లా, కౌన్సిలర్ అబూ షబ్బీర్, జఫర్ K&B, అల్మస్, ముఖిత్, షైక్ నుమాన్, జూనెద్, మొసీన్, మస్జీద్ సదర్ జబ్బార్, శైఫుద్దీన్ బాబా తదితరులు పాల్గొన్నారు.