Chitram news
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 4:13 pm Editor : Chitram news

ఘనంగా సంత్ సేవాలాల్ దీక్ష వాసుల పాదయాత్ర 

చిత్రం న్యూస్ ముథోల్ : విట్టోలి తాండాలోని  జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ దీక్ష వాసులు  పౌరదేవి వరకు పాదయాత్ర చేపట్టారు. బుదువారం ఉదయం ఆలయంలో హారతి తీసుకొని 7:30 గంటలకు  పాదయాత్రకు తండా ఆడపడుచులు, యువతీ, యువకులు, పాటలు పాడుతూ సేవాలాల్ దీక్ష వాసులను విట్టోలితాండా నుంచి పౌరా దేవి వరకు ఘనంగా పాదయాత్రకు తండావాసులు తరలివచ్చారు. సేవాలాల్ దీక్ష వాసులు భక్తులు విట్టోలి తాండ నుండి దాదాపు 270 కిలోమీటర్ల పాదయాత్ర పౌరా దేవి వరకు దాదాపు 5 రోజులలో చేరుకుంటామని సేవాలాల్ దీక్ష వాసులు తెలిపారు. తదనంతరం మహోర్, రువ్విఘడ్ ఆలయంలో శ్రీ రామ నవమి సందర్భంగా పౌరదేవితోపాటు వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తామని శివలాల్ దీక్ష వాసులు తెలిపారు.