Chitram news
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 3:52 pm Editor : Chitram news

ప్రముఖ సాహిత్య వేత్త మధు బావల్కర్‌కు మాజీ ఎమ్మెల్యే బోస్లె నారాయణ రావు పాటిల్ సత్కారం

చిత్రం న్యూస్, ముథోల్: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి  మాజీ,శాసనసభ్యులు బోస్లె నారాయణ రావు పాటిల్ ఆదిలాబాద్‌కు చెందిన ప్రముఖ సాహిత్య వేత్త, రచయిత మధు బావల్కర్ గారిని మర్యాదపూర్వకంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధు బావల్కర్ సా హిత్య రంగంలో చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. సమాజానికి మంచి సందేశాలను అందించేలా ఆయన రచనలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి విలువైన రచనలతో సమాజానికి మార్గదర్శకత్వం అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ చంద్రే, మాజీ ఎంపీపీ రామచంద్ర రెడ్డి, చంద్రకాంత్ యాదవ్, నాయకులు శివాజీ, దేవిదాస్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.