బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని మృతికి యాజమాన్యమే కారణం: పల్లపు తులసీరామ్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోనీ ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మల్లిపూడు తేజస్వని మృతికి యూనివర్సిటీ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ ఆరోపించారు. విద్యార్థినికి సకాలంలో సరైన వైద్యం అందించడంలో యూనివర్సిటీ యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు.అత్యవసర పరిస్థితుల్లో పెద్ద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలనే స్పృహ కూడా వీసీకి లేదని, టెక్నికల్ అంశాలపైనే దృష్టి సారించి, విద్యార్థి ప్రాణాలను బలిగొన్నారని రాష్ట్ర కార్యదర్శి...