Chitram news
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 9:26 pm Editor : Chitram news

ఆర్జీయూకేటీ బాసర విద్యార్థిని తేజస్విని మృతి పట్ల సంతాపం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పి.యు.సి రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లిపూడు తేజస్విని మరణం పట్ల విశ్వవిద్యాలయ యంత్రాంగం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.​ మెదక్ జిల్లా రామచంద్రాపురం నివాసి అయిన తేజస్విని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం నిమిత్తం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. గత కొన్ని నెలల నుంచి తేజస్విని ఇంటిదగ్గరే చికిత్స తీసుకుంటున్నారు. తేజస్విని మృతి పట్ల తోటి విద్యార్థులు, విశ్వవిద్యాలయం అధికారులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ​వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.