తరోడ పల్లె దవాఖానలో వైద్యుడిని నియమించాలి
చిత్రం న్యూస్ ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఉన్న పల్లె దవాఖానలో సరైన వైద్య సేవలు అందడం లేదని, అక్కడ డాక్టర్‌ను వెంటనే నియమించాలని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గడిపల పరమేష్ డిమాండ్ చేశారు.గ్రామంలోని పల్లె దవాఖాన కేవలం పేరుకే పరిమితమైందని, నెలలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తెరిచి, అదీ గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయడానికి మాత్రమే వినియోగిస్తున్నారని పరమేష్ విమర్శించారు. దీనివల్ల...