Chitram news
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 6:46 pm Editor : Chitram news

నిర్మల్ జిల్లాలో గ్యాస్ గోదాం తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఇండేన్ గ్యాస్ సిలిండర్ల గోదాంను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మంగళవారం సందర్శించారు. గోదాంలో గ్యాస్ సిలిండర్ల నిల్వ, భద్రతా ప్రమాణాలు, సరఫరా విధానం వంటి అంశాలను వారు సమీక్షించారు. వినియోగదారులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సిలిండర్లు అందాలని సూచించారు. గోదాం సందర్శన అనంతరం, అక్కడికి వచ్చిన గ్యాస్ వినియోగదారులతో అధికారులు నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సరఫరాలో జాప్యం లేదా ఇబ్బందులు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్, ఎస్పీ హెచ్చరించారు. వినియోగదారులకు సమయానికి సిలిండర్లు అందేలా చూడాలని ఆదేశించారు.గ్యాస్ పంపిణీలో అక్రమాలు జరగకుండా పటిష్టమైన నిఘా కొనసాగించాలని మండల అధికారులకు సూచించారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసీల్దార్ సంధ్యా రాణి, ఎస్.ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.