-Advertisement-

ఉపాధి హామీ పనులను పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం నేతలు 

చిత్రం న్యూస్ నిర్మల్ : నిర్మల్ జిల్లా కొండాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, కొలతలు లేకుండా డబ్బులు చెల్లించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీలకు రూ.800 కూలీ చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, పనిముట్లు గడ్డపార తట్టా పారా కొనుగోలు చేసి ఇవ్వాలని, పని ప్రదేశాలలో టెంట్ సౌకర్యంకల్పించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి పనులను ఎగ్గొట్టడం కోసమే కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ చట్టం తెచ్చిందన్నారు .కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే చెల్లిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం 40% చెల్లించాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాన్ని మోయలేదని ఉపాధి హామీ పని దానికి అదే బంద్ అవుతుందని బీజేపీ సర్కార్ ఈ చట్టాన్నీ తీసుక వచ్చిందన్నారు. తక్కువ బడ్జెట్ కేటాయించి ఎక్కువ రోజులు పని ఎలా కల్పిస్తారు. 125 రోజులు పని కల్పిస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అన్నారు . నరేంద్ర మోడీ సర్కార్ కు రైతులు పేదలు, వ్యవసాయ కూలీలు కార్మికులంటే ఎలర్జీ అన్నారు. అందుకే కొత్త కొత్త చట్టాలను తీసుకువచ్చి ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. ఈ చట్టం అమల్లోకి ఏప్రిల్ ఫస్ట్ నుండి రానుందని,ఈ చట్టం ద్వారా వ్యవసాయ కూలీలు పని అడిగే హక్కుని కోల్పోతున్నారు. వీబీజీ రాంజీ చట్టం రద్దుకై దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టనున్నామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు బర్కుంట గంగారం, నిర్మల్ మండల కన్వీనర్ సుంకరి లక్ష్మి, కో కన్వీనర్ భాగ్యశ్రీ ,సోన్ మండల కన్వీనర్ *బక్కూరి రవీందర్, కొండాపూర్ గ్రామ ఉపాధి హామీ కూలి సంఘం నాయకులు ఎల్లుల్ల శ్రీనివాస్, అల్లం గంగాధర్, మంద పోశెట్టి, మహిళా కూలీలు పాల్గొన్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments