Chitram news
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 5:33 pm Editor : Chitram news

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పై అపోహలు వీడాలి : జిల్లా వైద్యాధికారి రాజేందర్ 

చిత్రం న్యూస్, నిర్మల్ : గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ పాపిల్లో వైరస్ (హెచ్‌పీవీ ) వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు వీడాలని నిర్మల్ జిల్లా వైద్యాధికారి డా.రాజేందర్ సూచించారు. జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ఒక ప్రధాన సమస్యగా మారిందని డాక్టర్ రాజేందర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ క్యాన్సర్‌ను నివారించడానికి ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ఉచితంగా అందిస్తోందని తెలిపారు.ఈ వ్యాక్సిన్ 14 ఏళ్లు నిండిన బాలికలకు, 15 ఏళ్ల లోపు వారికి ఉద్దేశించబడిందన్నారు. అర్హులైన బాలికలందరికీ వ్యాక్సిన్ అందించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే జాబితాలను సిద్ధం చేసిందని, త్వరలోనే వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను ఖరారు చేసి అమలు చేస్తామని ఆయన వివరించారు.ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అర్హులైన బాలికల జాబితాలు తయారు చేయబడ్డాయని, త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేసి అందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో ప వన్, ప్రోగ్రాం అధికారి సౌమ్య, పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.