మాజీ ఎమ్మెల్యే పార్థివ దేహానికి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
చిత్రం న్యూస్, ఉట్నూర్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ మృతి పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. అజ్మీర గోవింద్ నాయక్ ప్రజల కోసం అంకితభావంతో సేవలందించిన ప్రజానాయకుడని కొనియాడారు....