Chitram news
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 11:39 am Editor : Chitram news

నిర్మల్ బుద్ధ విహార్ లో  కొనసాగుతున్న భీమ్ దీక్ష, జ్ఞాన దీక్షలు

చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ బుద్ధ విహార్ లో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ ఆధ్వర్యంలో  డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ భీమ్ దీక్ష జ్ఞాన దీక్షలు రెండో రోజు కొనసాగాయి.ముందుగా గౌతమ బుద్ధుడు విగ్రహానికి, అంబేద్కర్ చిత్రపటానికి, జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి పంచశీల ప్రార్థన చేశారు. ఇద్దరు ఉపాసకులు. గొల్లపేట్ కు చెందిన సింగరి జగదీశ్వర్, చించోలి (బి) గ్రామానికి చెందిన గ్రామ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మట్ట గంగాధర్ లు భీమ్ దీక్ష జ్ఞాన దీక్షలను స్వీకరించారు. తెల్లని దుస్తులు, నీలి కండువాలు ధరించారు. మహనీయుడు కాన్షిరాం జయంతి రోజు ప్రారంభమైన ఈ దీక్షలు డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి వరకు కొనసాగనున్నాయి. ఇంకా ఎవరైన దీక్ష స్వీకరించదలిచిన వారు మధ్యలో ఎప్పుడైన స్వీకరించ వచ్చు అని అన్నారు. అనంతరం. రావుల గంగన్న గ్రంథ పఠనం చేశారు . స్వీట్లు, పండ్లు, పులిహోర, పాయసం పంపిణీ చేశారు . వందన సమర్పణతో ముగించారు.ఈ కార్యక్రమంలో నిర్మల్ బుద్ధ విహార్ కమిటీ అధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి మధుకర్ మునేశ్వర్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు కొంతం మురళీధర్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్, భగత్ నారాయణ, జాడే సంజీవ్, మధుకర్ గైక్వాడ్, సంఘర్ష్ గైక్వాడ్, ఉపాసిక కొంతం ఆమ్రపాలిలు తదితరులు పాల్గొన్నారు.