భీంసరిలో ఘనంగా గృహప్రవేశం: హాజరైన మాజీ ఎంపీటీసీ బిక్కి గంగాధర్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్:ఆదిలాబాద్ నియోజకవర్గంలోని భీంసరి గ్రామంలో పోతారాజు శోభ-అశోక్ దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భీంసరి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు బిక్కి గంగాధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులను ఆయన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బిక్కి గంగాధర్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని కొనియాడారు. పూరిగుడిసెల్లో మగ్గుతున్న వారికి...