ఘనంగా హీరాసుక జయంతి వేడుకలు:పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో హీరాసుక జయంతి వేడుకలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, హీరాసుక విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, హీరాసుక ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా ప్రధాన్ సమాజం అభ్యున్నతికి చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంతో పాటు, ప్రధాన్ సంస్కృతిని కాపాడటంలో ఆయన కీలక పాత్ర...