చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం ఏకాదశి పర్వదినాన దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి ఆలయంలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఈవో విజయరామారావు ఏఈఓ గంగా శ్రీనివాస్, పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చక వైదిక బృందం ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక వేద ఆశీర్వాద మండపంలో అర్చకులు వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు .వీరికి ఆలయ ఈవో విజయ రామారావు, ఏఈఓ గంగా శ్రీనివాస్ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కు ఆలయ మర్యాదలతో శాలువాతో ఘనంగా సన్మానించారు.బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు స్వామి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య బాసర రెండు రోజుల పర్యటనలో భాగంగా దేవస్థానంలోని రాజన్న నిలయం అతిథి గృహంలో రాములు స్వామిని కలసి దర్శించుకున్నారు. వీరి వెంట మహేందర్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ సుకేష్ రావు, ఆలయ పీ ఆర్ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.

