ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ఆశా వర్కర్ల వినతి
చిత్రం న్యూస్, బైంసా: తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి నెరవేర్చేలా చూడాలని ఆశా వర్కర్లు శనివారం ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ను నిర్మల్ జిల్లా బైంసాలోని అయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో ఆశ వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బీజేఎల్ఫీ...