పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలో మార్చి14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 16 వరకు కొనసాగే పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 5,443 మంది, బాలికలు 5,445 మంది ఉన్నారు.పరీక్షల నిర్వహణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు,...