చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలో మార్చి14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 16 వరకు కొనసాగే పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 5,443 మంది, బాలికలు 5,445 మంది ఉన్నారు.పరీక్షల నిర్వహణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు.నిర్దేశించిన సమయం కంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /

