చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా మండల కార్యాలయాల ఎదుట చేపట్టే ధర్నాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధ వాతావరణం సాకుతో ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతోందని విమర్శించారు. రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపు, కళ్యాణ లక్ష్మీ, నగదు పంపిణీ వంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.