భైంసాలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
*పాల్గొన్న బీసీ సంఘం, జనసేన పార్టీ నాయకులు
చిత్రం న్యూస్,భైంసా: బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసి సంఘం జిల్లా నాయకులు సుంకేట పోశెట్టి, జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు అన్నారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనం ఆవరణలో సర్దార్ పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను స్థానిక బీసీ సంఘం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిల్, రజక సంఘం నాయకులు శ్రీను, ముత్యం, సాయినాథ్, భూమేష్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.